బ్లాగు కాపీ రైట్ టెక్స్ట్ రిమూవ్ చేయడం - ట్యుటోరియల్

కొత్త బ్లాగరు బ్లాగులో డీఫాల్ట్ టెంప్లేట్స్‌నుపయోగించినపుడు క్రింది భాగాన ఆ టెంప్లేట్ డిజైనర్ పేరు మరియు డిజైనర్ సైట్ యొక్క లింక్ చూపబడుతుంటాయి. ఈ టెక్స్ట్ మొత్తం కోడ్‌లో ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఇలా ఎన్‌క్రిప్ట్ చేయబడిన కాపీరైటెడ్ టెక్స్ట్‌ను ఎలా రిమూవ్ చేయాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం.1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్‌లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్‌లో క్రింది విధంగా మీ బ్లాగు Design మీద క్లిక్ చేయండి.2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.

3. ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్‌ను కేవలం ఎడిటింగ్ చేయాలనుకుంటే టెంప్లేట్ కోడ్‌లో టెంప్లేట్ డిటైల్స్ మోడిఫై చేయవలసి ఉంటుంది. ఈ క్రింది స్క్రీన్ షాట్‌లో చూపిన విధంగా డిజైనర్ పేరును, డిజైనర్ సైట్ యొక్క లింక్‌ను మీకు నచ్చిన విధంగా మార్చుకొని ప్రివ్యూ చూడండి. OK అనుకుంటే SAVE చేయండి.4. ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్‌ను పూర్తిగా రిమూవ్ చేయడానికి CTRL+F ప్రెస్ చేసి ఈ క్రింది కోడ్‌ను సెర్చ్ చేయండి.
<!-- outside of the include in order to lock Attribution widget -->


5. పైన సెర్చ్ చేసిన కోడ్‌కు క్రింది లైన్‌లో కోడ్ ఈ క్రింది కోడ్‌ను పోలిన కోడ్‌ను వెతకండి.6. పై కోడ్‌లో రెండవ లైన్ మొదట "<!-- " ను చివరి లైన్లో " -->" కామెంట్ ట్యాగ్స్ యాడ్ చేసి ప్రివ్యూ చూడండి. OK అనుకుంటే SAVE చేయండి.7. SAVE చేసినపుడు ఈ క్రింది విధంగా కనిపించే డైలాగ్ బాక్స్ లో DELETE WIDGETS ను క్లిక్ చేయండి.

బ్లాగులో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం ఎలా?

మీ బ్లాగులో ఫోటో గ్యాలరీ ఎలా ఏర్పాటు చేయాలో ఈ క్రింది లింక్ లోని ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోండి.

http://mahigrafix.com/forums/showthread.php?tid=4991

బ్లాగర్ కొత్త ఫీచర్ : పోస్టు క్రింద షేర్ దిస్ బటన్స్ (Email this, Blog this, Twitter, FB, GBuzz)

పాత బ్లాగరు బ్లాగులో ఆ పోస్టును నెట్ ప్రపంచానికి షేర్ చేయడానికి, Template code లో Share buttons code యాడ్ చేయవలసిఉండేది. ప్రస్తుతం ఉన్న కొత్త బ్లాగరు సర్వీస్ లో ఆ ఫీచర్ Blog posts settings లో లభిస్తోంది. Share this post ఫీచర్ ను ఎలా ఎనేబుల్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెల్సుకోండి.


1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి.2. క్రింది విధంగా Page Elements >> Blog Posts >> Edit ను క్లిక్ చేయండి.


3. Show Share Buttons కు Check Mark పెట్టి Save చేయండి.

ఇకనుంచి మీ బ్లాగులోని ప్రతి పోస్టులో అడుగు భాగాన Share Buttons కనిపిస్తాయి.

Demo: http://telugucomputers.blogspot.com/2010/07/send-error-message.html