బ్లాగ్ అంటే?

నం నిత్య జీవితంలో ఉపయోగించే డైరీ లాంటిదన్నమాట. మనం సహజంగా వ్యక్తిగత విషయాలను వ్రాయటానికి ఒక పర్సనల్ డైరీ...అప్పటికపుడు తెలుసుకొన్న కొత్త విషయాలను మరిచిపోకుండా ఉండటానికి ఇంకొక పబ్లిక్ డైరీని ఉపయోగిస్తుంటాము
పర్సనల్ డైరీని మనకు బాగా సన్నిహుతులైన వాళ్లతోనే షేర్ చేస్కుంటుంటాము...పబ్లిక్ డైరీని అందరితో షేర్ చేస్కుంటుంటాము...అలాగే ఈ బ్లాగులో కూడా మీ వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాలను, మీకు తెలిసిన విషయాలను వ్రాసి మీకు నచ్చిన విధంగా షేర్ చేయవచ్చు.
మీరు పర్సనల్ విషయాలకోసం ఒక డైరీ, పబ్లిక్ విషయాలకోసం ఒక డైరీ ఉపయోగిస్తున్నట్లుగానే ఇందులో కూడా మీరు ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ఉచిత బ్లాగును మీ జీమెయిల్ అకౌంట్ నుపయోగించి తయారు చేస్కొనవచ్చును...
డైరీ లో వ్రాసే ఒక్కొక్క విషయం బ్లాగులో పోస్ట్ అని పిలుస్తారు. మీరు మీ డైరీలనన్నింటినీ డ్యాష్ బోర్డ్ లో పెట్టినట్లుగానే,
ఇందులో కూడా మీ జీ మెయిల్ ఐడీ మీద మీరు ఏర్పరిచిన బ్లాగులన్నీ ఒకే డ్యాష్ బోర్డ్ లో ఉంటాయి. ఆ డ్యాష్ బోర్డ్ ను ఓపెన్ చేసి, అందులో ఉన్న మీ బ్లాగులలో కొత్త కొత్త పోస్టులను చేయవచ్చు...పాత పోస్టులను ఎడిట్ చేయవచ్చు.. డెలెట్ చేయవచ్చు....
ఏదేమైనా బ్లాగు అనేది, మీ అభిప్రాయలకు, మీ లోని టాలెంట్ కు అద్దం పట్టేలా ఉండేలా ఉంటే మంచిది. మీ బ్లాగులో ఉన్న విషయం పది మందికీ ఉపయోగ పడేలా ఉంటే మరింత మంచిది. బ్లాగు ద్వారా పబ్లిక్ కు మీరు తెలియచేయాలనుకున్న విషయాన్ని ఖాళీ సమయంలో
రోజూ కొంచెం కొంచెం గా డ్రాఫ్టు తయారు చేసి పెట్టుకొని తరవాత బ్లాగులో ప్రచురించుకొనే విధంగా కూడా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి...అలాగే మీరు మీ బ్లాగును ఇంటర్నెట్ నుండి తీసివేయాలనుకున్నపుడు డెలెట్ కూడా చేయవచ్చు.

బ్లాగు వల్ల ఉపయోగాలు:
బ్లాగులను ఉచితంగా తయారు చేస్కోవచ్చు.
మీలో ఉన్న నాలెడ్జి ని అందరీకీ పంచవచ్చు...తద్వారా మీరు ప్రపంచానికి ఎంతో కొంత వెలుగునివ్వవచ్చు.

మీ మనసు అంతరంగపు పొరలలో దాగి ఉన్న మీ మనోభావాలను, ఆవేశాన్ని- దృశ్య, శ్రవణ రూపంలో బ్లాగులో ఇనుమడింపచేసి ప్రపంచానికి తెలియచేసి మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు.
బ్లాగులలో మీరు ప్రచురించిచ పోస్టులు ఇతరులను ఎంతగా ప్రభావితం చేశాయి అనేది: మీ పోస్టుల క్రింద వారిచ్చే కామెంట్ల రూపంలో ఇక్కడ తెలుసుకోని తద్వారా ఇకముందు పొస్ట్ లను ఇంకా మెరుగు పరచవచ్చు.
మీ బ్లాగును పాపులర్ చేసి గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
ఒకే జీమెయిల్ ఐడీ మీద అనేక సొంత బ్లాగులు తయారు చేస్కొన వచ్చు.

మీ పోస్ట్ లకు Author name, Post Date లను Hide చేయాలనుకుంటున్నారా...?

మీ పోస్ట్ లకు Author name, Post Date లను Hide చేయాలంటే వెరీ సింపుల్: ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవండి....
1 .మొదట మీ Login Id తో http://www.blogger.com లోకి Sign In అవండి.

2. తర్వాత Dashboarda లో Layout ను క్లిక్ చేయండి.

3. ఈ క్రింది విధంగా Layout లో Page Elements క్లిక్ చేయండి.

4. Blog Posts లో Edit బటన్ ను క్లిక్ చేయండి.5. క్రింద Select Items లో మీరు మీ పోస్ట్ Attributes లో ఏమేమి Hide చేయాలనుకుంటున్నారో వాటన్నింటికీ Ticks తీసివేయండి.
6. Save బటన్ ను క్లిక్ చేయండి.అంతే ఇక మీ పోస్ట్ లో మీరు De-select చేసిన వన్నీ Hide అయిపోయి వుంటాయి.

మీకు నచ్చిన ఐకాన్ ను మీ బ్లాగు url address కు index icon గా సెట్ చేయండి

మీ బ్లాగు url address కు మీ ఫేవరేట్ ఐకాన్ ను మార్చుకోండి..వెరీ సింపుల్
ఈ క్రింది ఇమేజ్ లో గమనించండి..నా బ్లాగుకు మొదట ఈ క్రింది విధంగా బ్లాగర్ వారి డీఫాల్ట్ ఐకాన్ లు ఉండేవి.


తర్వాత ఈ క్రింది విధంగా నాకు నచ్చిన ఐకాన్ ను మార్చాను.


ఇలా మీ ఫోటోను కాని, మీకు నచ్చిన ఇమేజ్ ను కాని, బ్లాగు టైటిల్ కు ముందు మరియు బ్లాగు url address కు ముందు చాలా సులభంగా replace చేయవచ్చు... డీఫాల్ట్ గా ఉన్న బ్లాగర్ ఐకాన్ ను మార్చి మనకు నచ్చిన ఇమేజ్ ను మార్చడానికి, ఈ క్రింద స్టెప్స్ ఫాలో అయి మీరు కూడా మీ బ్లాగర్ కు మార్చుకోండి.

1. మీకు నచ్చిన ఇమేజ్ ను ఫోటో షాప్ , Paint.Net(Free) లాంటి ఇమేజ్ ఎడిటర్స్ లో width=32; height32; resolution-72; గా రీసైజ్ చేయండి. ఒక వేళ మీరు యానిమేటెడ్ gif ఐకాన్ తయారు చేస్కోవాలంటే Ulead GIF Animator (15 days trial version) లాంటి gif animation software ను డౌన్లోడ్ చేస్కొని మీకు నచ్చిన gif animation ను పై మెజర్ మెంట్స్ తో తయారు చేస్కొండి.

2.మీరు తయారు చేసిన ఇమేజ్ ని ఫ్రీ ఇమేజ్ హోస్టింగ్స్ (freeimagehosting, tinypic, Imageshack) లోకి అప్ లోడ్ చేసి ఇమేజ్ కోడ్ ను కాపీ చేసి పెట్టుకోండి

ఇమేజ్ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

<img src="http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gif"/>3 .మొదట మీ Login Id తో http://www.blogger.com లోకి Sign In అవండి.

4. తర్వాత Dashboarda లో Layout ను క్లిక్ చేయండి.


5. ఈ క్రంది విధంగా Edit Html క్లిక్ చేయండి


6. Download Full Template ను క్లిక్ చేసి మీకు ఇపుడు రన్నింగ్ లో ఉన్న బ్లాగు టెంప్లేట్ ను మీ కంప్యూటర్ లో సేవ్ చేయండి. (ఒక వేళ మీరు ఇపుడు చేసే కోడ్ ఎడిటింగ్ వలన బ్లాగు కరప్ట్ అయినా కూడా మీరు ఇంతకు ముందు స్థితి లోకి వెళ్లడానికి)

7. తర్వాత ఈ క్రింది code ను కాపీ చేస్కొని, Edit Html window లో Ctrl+F & Ctrl+V నుపయోగించి ఎక్కడ ఉందో కనుగొనండి.
<title><data:blog.pageTitle/></title>


8. ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి URL of your icon file ప్లేస్ లో మొదట మీరు కాపీ చేస్కొన్న ఇమేజ్ కోడ్http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gifను రీప్లేస్ చేయండి.

<link href='URL of your icon file' rel='shortcut icon' type='image/gif'/>

9. ఇపుడు 8 వ స్టెప్ లోని కోడ్ మొత్తం చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి.
<link href='http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gif' rel='shortcut icon' type='image/gif'/>

10. ఇపుడు పై కోడ్ ను 7 వ స్టెప్ లోని కోడ్ క్రింద కాపీ చేయండి. ఇపుడు కంప్లీట్ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి.
<title><data:blog.pageTitle/></title>


<link href='http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gif' rel='shortcut icon' type='image/gif'/>


11. ఇక SAVE TEMPLATE ను క్లిక్ చేసేయటమే...మీ బ్లాగు టైటిల్ ఐకాన్ మరియు URL ADDRESS ICON రెండూ మార్చబడి ఉంటాయి.

My Blog in Your Blog

బ్లాగు ట్యుటోరియల్స్ తెలుగులో
పైన కనిపించే నా బ్లాగు లోగో ఇమేజ్ లింక్ ను మీ బ్లాగు లో కాని వెబ్ సైట్ లో కాని పెట్టుకోవాలనుకుంటే ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి మీ బ్లాగులో Add Page Templates లో HTML/Javascript లో పేస్ట్ చేయండి
<a href=" http://superblogtutorials.blogspot.com/" target="_blank" title="blog tuto">

<img border="0" alt="బ్లాగు ట్యుటోరియల్స్ తెలుగులో" src="http://img204.imageshack.us/img204/2140/blogbuttonav4.jpg" /></a>

డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ను మీ బ్లాగు కు ఎలా అప్లై చేయాలో ట్యుటోరియల్

బ్లాగర్.కామ్ నుండి కాకుండా ఇతర సైట్ల నుండి డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ను మీ బ్లాగుకు అప్లై చేయడానికి ఈ పోస్ట్ లో పూర్తి ట్యుటోరియల్ వివరంగా ఉంటుంది.
1.మొదట మీ Login Id తో http://www.blogger.com లోకి Sign In అవండి.
2. తర్వాత Dashboarda లో Layout ను క్లిక్ చేయండి.
3. ఈ క్రంది విధంగా Edit Html క్లిక్ చేయండి

4. Download Full Template ను క్లిక్ చేసి మీకు ఇపుడు రన్నింగ్ లో ఉన్న బ్లాగు టెంప్లేట్ ను మీ కంప్యూటర్ లో సేవ్ చేయండి. (ఒక వేళ మీరు కొత్త టెంప్లేట్ ను లోడ్ చేసినపుడు బ్లాగు కరప్ట్ అయినా కూడా మీరు ఇంతకు ముందు స్థితి లోకి వెళ్లడానికి)

5.ఇపుడు మీరు డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ను ఇన్స్టాల్ చేద్దాం...మీరు డౌన్లోడ్ చేసిన template, rar ఫైల్ అయితే ముందు winrar ద్వారా ఈ క్రింది విధంగా extract చేయండి.
6.తర్వాత ఈ క్రింది విధంగా Browse బటన్ ను క్లిక్ చేయండి.

7. తర్వాత ఇందాక మీరు extract చేసిన Folder ను ఓపెన్ చేసి దానిలో *.xml ఫైల్ ను ఓపెన్ చేయండి


8.ఈ క్రింది విధంగా Upload బటన్ ను క్లిక్ చేయండి.


9. తర్వాత CONFIRM&SAVE బటన్ ను క్లిక్ చేయండి


10. అంతే ఇక మీ బ్లాగు ను View క్లిక్ చేసి చూడండి...మీ బ్లాగు కు కొత్త Template మార్చబడి ఉంటుంది.

న్యూస్ పేపర్ స్టైల్ పోస్ట్

ఈ క్రింది విధంగా మొదటి అక్షరం లావుగా మిగిలిన అక్షరాలన్నీ నార్మల్ గా ఉండేట్లుగా న్యూస్ పేపర్ స్టైల్
మీ పోస్ట్ కు న్యూస్ పేపర్ స్టైల్ అప్లై చేయడానికి ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి...It is very Easy

1. కొత్త పోస్ట్ చేసేటపుడు...ఈ క్రింది విధంగా Edit Html క్లిక్ చేయండి


2.ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి పోస్ట్ బాక్స్ లో పేస్ట్ చేయండి.
<span style="float:left;color: #000;background:#fff;line-height:80px; padding-:1px 5px 0 0; font-family:times; font-size:100px;">మొదటి అక్షరం</span>3. తర్వాత కోడ్ లో మొదటి అక్షరం...ప్లేస్ లో మీ పోస్ట్ లోని మొదటి అక్షరం ను రీప్లేస్ చేసి PUBLISH POST క్లిక్ చేయండి.
ఇక మీ పోస్ట్ కు న్యూస్ పేపర్ స్టైల్ యాడ్ అయినట్లే

అందమైన బ్లాగు టెంప్లేట్స్ ను ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి

Blogger.com వారు, వారి టెంప్లేట్ లైబ్రెరీలో ఉచితంగానే కొన్ని టెంప్లేట్స్ ను అందిస్తున్నారు. వాటితో మీ బ్లాగును డిజైన్ ను మార్చుకోవచ్చు. అయితే అవికాకుండా...ఫ్లోరల్, బ్యుజినెస్, యాడ్స్, యానిమేషన్, వీడియో, ఇమేజ్, మ్యూజిక్, గాడ్జెట్స్, నోట్ బుక్ ఇలా ఇంకా చాలా రకాల స్టైల్స్ తో రెడీమేడ్ ఫ్రీ టెంప్లేట్స్ ను ఉచితంగా మరికొన్ని సైట్స్ అందిస్తున్నాయి. వాటికి సంబంధించిన అన్నీ సైట్స్ వివరాలు ఈ పోస్టు లో చూడవచ్చు.

Ipietoon Free Templates

Blogger Styles

Blogger Templates

JackBook Templates

BTemplates

Pocket Templates

eBlog Templates

పోస్ట్ టైటిల్ కు ఇమేజ్ ను అతికించండి

మీ పోస్ట్ టైటిల్ కు ప్రక్కనే ఒక చిన్న ఇమేజ్ ను యాడ్ చేసి పోస్ట్ యొక్క టైటిల్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేయవచ్చు.
ఈ క్రింది విధంగా ఉంటుంది1. పోస్ట్ టైటిల్ కు పెట్టాలనుకున్న ఇమేజ్ ను ఫోటోషాప్ లాంటి ఇమేజ్ ఎడిటర్స్ నుపయోగించి చిన్న సైజుగా మార్చుకొండి.

2. ఆ ఇమేజ్ ని ఫ్రీ ఇమేజ్ హోస్టింగ్స్ (www.freeimagehosting.net, http://tinypic.com)లోకి అప్ లోడ్ చేసి ఇమేజ్ కోడ్ ను కాపీ చేసి పెట్టుకోండి

ఇమేజ్ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

<img src=http://www.freeimagehosting.net/uploads/cb0a64152b.jpg/>

3.www.blogger.com లోకి మీ ID తో Login అవండి.
4.Dashboard లో Layout ను క్లిక్ చేయండి.


5.తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.

6. Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

7.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.8.క్రింద ఉన్న టెంప్లేట్ కోడ్ లో ఈ క్రింది కోడ్ ను కనుక్కోండి.

<a expr:href='data:post.url'><data:post.title/></a>


9.పైన చూపించిన కోడ్ కు ఈ క్రింది విధంగా, ఇమేజ్ కోడ్ ను యాడ్ చేయండి.

<a expr:href='data:post.url'> <img src=http://www.freeimagehosting.net/uploads/cb0a64152b.jpg/>&#160; <data:post.title/></a>

10.SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి.

అంతే ఇక మీ పోస్ట్ టైటిల్ కు ఇమేజ్ యాడ్ అవుతుంది..

బ్లాగు స్టార్ట్ చేయడం ఎలా?...

blogger.com లో బ్లాగు స్టార్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా gmailలో అకౌంట్ ఉండాల్సిందే..gmail లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత blogger.com లో బ్లాగు ఎలా తయారు చేయాలో ఈ క్రింద వీడియోలో చూడండి. (గమనిక: ఈ క్రింది వీడియోను మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేయాలంటే firefox కు Better you tube downloader ను ఇన్స్టాల్ చేసి దాని ద్వారా డౌన్లోడ్ చేయండి.)
(త్వరలోనే వీడియో)