పోస్ట్ టైటిల్ కు ఇమేజ్ ను అతికించండి

మీ పోస్ట్ టైటిల్ కు ప్రక్కనే ఒక చిన్న ఇమేజ్ ను యాడ్ చేసి పోస్ట్ యొక్క టైటిల్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేయవచ్చు.
ఈ క్రింది విధంగా ఉంటుంది1. పోస్ట్ టైటిల్ కు పెట్టాలనుకున్న ఇమేజ్ ను ఫోటోషాప్ లాంటి ఇమేజ్ ఎడిటర్స్ నుపయోగించి చిన్న సైజుగా మార్చుకొండి.

2. ఆ ఇమేజ్ ని ఫ్రీ ఇమేజ్ హోస్టింగ్స్ (www.freeimagehosting.net, http://tinypic.com)లోకి అప్ లోడ్ చేసి ఇమేజ్ కోడ్ ను కాపీ చేసి పెట్టుకోండి

ఇమేజ్ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

<img src=http://www.freeimagehosting.net/uploads/cb0a64152b.jpg/>

3.www.blogger.com లోకి మీ ID తో Login అవండి.
4.Dashboard లో Layout ను క్లిక్ చేయండి.


5.తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.

6. Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

7.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.8.క్రింద ఉన్న టెంప్లేట్ కోడ్ లో ఈ క్రింది కోడ్ ను కనుక్కోండి.

<a expr:href='data:post.url'><data:post.title/></a>


9.పైన చూపించిన కోడ్ కు ఈ క్రింది విధంగా, ఇమేజ్ కోడ్ ను యాడ్ చేయండి.

<a expr:href='data:post.url'> <img src=http://www.freeimagehosting.net/uploads/cb0a64152b.jpg/>&#160; <data:post.title/></a>

10.SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి.

అంతే ఇక మీ పోస్ట్ టైటిల్ కు ఇమేజ్ యాడ్ అవుతుంది..

No comments:

Post a Comment