బ్లాగ్ అంటే?

నం నిత్య జీవితంలో ఉపయోగించే డైరీ లాంటిదన్నమాట. మనం సహజంగా వ్యక్తిగత విషయాలను వ్రాయటానికి ఒక పర్సనల్ డైరీ...అప్పటికపుడు తెలుసుకొన్న కొత్త విషయాలను మరిచిపోకుండా ఉండటానికి ఇంకొక పబ్లిక్ డైరీని ఉపయోగిస్తుంటాము
పర్సనల్ డైరీని మనకు బాగా సన్నిహుతులైన వాళ్లతోనే షేర్ చేస్కుంటుంటాము...పబ్లిక్ డైరీని అందరితో షేర్ చేస్కుంటుంటాము...అలాగే ఈ బ్లాగులో కూడా మీ వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాలను, మీకు తెలిసిన విషయాలను వ్రాసి మీకు నచ్చిన విధంగా షేర్ చేయవచ్చు.
మీరు పర్సనల్ విషయాలకోసం ఒక డైరీ, పబ్లిక్ విషయాలకోసం ఒక డైరీ ఉపయోగిస్తున్నట్లుగానే ఇందులో కూడా మీరు ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ఉచిత బ్లాగును మీ జీమెయిల్ అకౌంట్ నుపయోగించి తయారు చేస్కొనవచ్చును...
డైరీ లో వ్రాసే ఒక్కొక్క విషయం బ్లాగులో పోస్ట్ అని పిలుస్తారు. మీరు మీ డైరీలనన్నింటినీ డ్యాష్ బోర్డ్ లో పెట్టినట్లుగానే,
ఇందులో కూడా మీ జీ మెయిల్ ఐడీ మీద మీరు ఏర్పరిచిన బ్లాగులన్నీ ఒకే డ్యాష్ బోర్డ్ లో ఉంటాయి. ఆ డ్యాష్ బోర్డ్ ను ఓపెన్ చేసి, అందులో ఉన్న మీ బ్లాగులలో కొత్త కొత్త పోస్టులను చేయవచ్చు...పాత పోస్టులను ఎడిట్ చేయవచ్చు.. డెలెట్ చేయవచ్చు....
ఏదేమైనా బ్లాగు అనేది, మీ అభిప్రాయలకు, మీ లోని టాలెంట్ కు అద్దం పట్టేలా ఉండేలా ఉంటే మంచిది. మీ బ్లాగులో ఉన్న విషయం పది మందికీ ఉపయోగ పడేలా ఉంటే మరింత మంచిది. బ్లాగు ద్వారా పబ్లిక్ కు మీరు తెలియచేయాలనుకున్న విషయాన్ని ఖాళీ సమయంలో
రోజూ కొంచెం కొంచెం గా డ్రాఫ్టు తయారు చేసి పెట్టుకొని తరవాత బ్లాగులో ప్రచురించుకొనే విధంగా కూడా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి...అలాగే మీరు మీ బ్లాగును ఇంటర్నెట్ నుండి తీసివేయాలనుకున్నపుడు డెలెట్ కూడా చేయవచ్చు.

బ్లాగు వల్ల ఉపయోగాలు:
బ్లాగులను ఉచితంగా తయారు చేస్కోవచ్చు.
మీలో ఉన్న నాలెడ్జి ని అందరీకీ పంచవచ్చు...తద్వారా మీరు ప్రపంచానికి ఎంతో కొంత వెలుగునివ్వవచ్చు.

మీ మనసు అంతరంగపు పొరలలో దాగి ఉన్న మీ మనోభావాలను, ఆవేశాన్ని- దృశ్య, శ్రవణ రూపంలో బ్లాగులో ఇనుమడింపచేసి ప్రపంచానికి తెలియచేసి మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు.
బ్లాగులలో మీరు ప్రచురించిచ పోస్టులు ఇతరులను ఎంతగా ప్రభావితం చేశాయి అనేది: మీ పోస్టుల క్రింద వారిచ్చే కామెంట్ల రూపంలో ఇక్కడ తెలుసుకోని తద్వారా ఇకముందు పొస్ట్ లను ఇంకా మెరుగు పరచవచ్చు.
మీ బ్లాగును పాపులర్ చేసి గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
ఒకే జీమెయిల్ ఐడీ మీద అనేక సొంత బ్లాగులు తయారు చేస్కొన వచ్చు.

3 comments:

 1. మహి గారు... కృతజ్నతలు...మాకూ విజ్నాన దానం చేయండి....

  ReplyDelete
 2. really nice sir ur doing public service

  ReplyDelete
 3. Dear chantigadu,

  you can also share your knowledge to public..join as a member in mahi-forum..In top of this blog, you can get the link to enter into mahi-forum. ThanQ

  ReplyDelete