మీకు నచ్చిన ఐకాన్ ను మీ బ్లాగు url address కు index icon గా సెట్ చేయండి

మీ బ్లాగు url address కు మీ ఫేవరేట్ ఐకాన్ ను మార్చుకోండి..వెరీ సింపుల్
ఈ క్రింది ఇమేజ్ లో గమనించండి..నా బ్లాగుకు మొదట ఈ క్రింది విధంగా బ్లాగర్ వారి డీఫాల్ట్ ఐకాన్ లు ఉండేవి.


తర్వాత ఈ క్రింది విధంగా నాకు నచ్చిన ఐకాన్ ను మార్చాను.


ఇలా మీ ఫోటోను కాని, మీకు నచ్చిన ఇమేజ్ ను కాని, బ్లాగు టైటిల్ కు ముందు మరియు బ్లాగు url address కు ముందు చాలా సులభంగా replace చేయవచ్చు... డీఫాల్ట్ గా ఉన్న బ్లాగర్ ఐకాన్ ను మార్చి మనకు నచ్చిన ఇమేజ్ ను మార్చడానికి, ఈ క్రింద స్టెప్స్ ఫాలో అయి మీరు కూడా మీ బ్లాగర్ కు మార్చుకోండి.

1. మీకు నచ్చిన ఇమేజ్ ను ఫోటో షాప్ , Paint.Net(Free) లాంటి ఇమేజ్ ఎడిటర్స్ లో width=32; height32; resolution-72; గా రీసైజ్ చేయండి. ఒక వేళ మీరు యానిమేటెడ్ gif ఐకాన్ తయారు చేస్కోవాలంటే Ulead GIF Animator (15 days trial version) లాంటి gif animation software ను డౌన్లోడ్ చేస్కొని మీకు నచ్చిన gif animation ను పై మెజర్ మెంట్స్ తో తయారు చేస్కొండి.

2.మీరు తయారు చేసిన ఇమేజ్ ని ఫ్రీ ఇమేజ్ హోస్టింగ్స్ (freeimagehosting, tinypic, Imageshack) లోకి అప్ లోడ్ చేసి ఇమేజ్ కోడ్ ను కాపీ చేసి పెట్టుకోండి

ఇమేజ్ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

<img src="http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gif"/>3 .మొదట మీ Login Id తో http://www.blogger.com లోకి Sign In అవండి.

4. తర్వాత Dashboarda లో Layout ను క్లిక్ చేయండి.


5. ఈ క్రంది విధంగా Edit Html క్లిక్ చేయండి


6. Download Full Template ను క్లిక్ చేసి మీకు ఇపుడు రన్నింగ్ లో ఉన్న బ్లాగు టెంప్లేట్ ను మీ కంప్యూటర్ లో సేవ్ చేయండి. (ఒక వేళ మీరు ఇపుడు చేసే కోడ్ ఎడిటింగ్ వలన బ్లాగు కరప్ట్ అయినా కూడా మీరు ఇంతకు ముందు స్థితి లోకి వెళ్లడానికి)

7. తర్వాత ఈ క్రింది code ను కాపీ చేస్కొని, Edit Html window లో Ctrl+F & Ctrl+V నుపయోగించి ఎక్కడ ఉందో కనుగొనండి.
<title><data:blog.pageTitle/></title>


8. ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి URL of your icon file ప్లేస్ లో మొదట మీరు కాపీ చేస్కొన్న ఇమేజ్ కోడ్http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gifను రీప్లేస్ చేయండి.

<link href='URL of your icon file' rel='shortcut icon' type='image/gif'/>

9. ఇపుడు 8 వ స్టెప్ లోని కోడ్ మొత్తం చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి.
<link href='http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gif' rel='shortcut icon' type='image/gif'/>

10. ఇపుడు పై కోడ్ ను 7 వ స్టెప్ లోని కోడ్ క్రింద కాపీ చేయండి. ఇపుడు కంప్లీట్ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి.
<title><data:blog.pageTitle/></title>


<link href='http://img217.imageshack.us/img217/4504/faviconsf5.gif' rel='shortcut icon' type='image/gif'/>


11. ఇక SAVE TEMPLATE ను క్లిక్ చేసేయటమే...మీ బ్లాగు టైటిల్ ఐకాన్ మరియు URL ADDRESS ICON రెండూ మార్చబడి ఉంటాయి.

5 comments:

 1. నా బ్లాగు http://www.tadepally.com లో మీరు చెప్పినట్లే చేశాను. విజయనంతంగా పూర్తయింది. నెనర్లు.

  ReplyDelete
 2. హుర్రే......... నా బ్లాగ్ కి కూడా ఐకాన్ పెట్టానోచ్.... :-) మహి గారికి నెనర్లు

  ReplyDelete
 3. Thanks mahi gaaru,
  I applied this to my blog http://eti-gattu.blogspot.com
  It works fine.

  ReplyDelete
 4. Thanks mahi garu
  iam also use my blog ..!  Thanks agian


  Sudhakar

  ReplyDelete