మీ బ్లాగు కు మీరు కాకుండా ఇంకొక Author ను యాడ్ చేయాలనకుంటున్నారా?

ఒకే బ్లాగుకు అనేక మంది రచయితలను యాడ్ చేసి, ఎవరి ఐడీ నుండి వారు, ఒకే బ్లాగులో పోస్ట్ లు చేసే సదుపాయం బ్లాగులకు ఉంది..అలా అనేక మంది టీం మెంబర్స్ ను ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1 ఈ క్రింద చూపినట్లుగా settings లో permissions క్లిక్ చేయండి.
.


2. ADD AUTHORS క్లిక్ చేయండి.


3. Choose from Contacts క్లిక్ చేయండి.


4. మీ జీమెయిల్ అకౌంట్ లోని contacts లో మరొక కొత్త విండో కనపడుతుంది.
అందులో మీరు ఎవరినయితే మీ బ్లాగుకు ఇంకొక రచయిత గా యాడ్ చేయాలనుకుంటున్నారో వారి మెయిల్ ఐడీ మీద క్లిక్ చేసి Done క్లిక్ చేయండి.


4. ఒక వేళ జీమెయిల్ అకౌంట్ లోని contacts లో మీరు బ్లాగులో చేర్చాలనుకు రచయిత మెయిల్ ఐడీ లేక పోయినట్లయితే Choose from Contacts పైనే ఉన్న ఖాళీ ప్లేస్ లో వారి మెయిల్ ఐడీని టైప్ చేసి INVITE బటన్ ను ప్రెస్ చేయండి.
అంతే ఇక వారికి మీ నుంచి రిక్వెస్ట్ మెయిల్ వెళుతుంది. వారు ఆ మెయిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్ క్లిక్ చేస్తే చాలు...ఇక వారు కూడా మీ బ్లాగులో కొత్త పోస్ట్ చేయవచ్చు...వారి పాత పోస్టులను ఎడిట్ చేయవచ్చు...కానీ మీ పాత పోస్టులను ఎడిట్ చేయలేరు. Layout డిజైన్లు మార్చ లేరు..

5. ఒక వేళ మీ బ్లాగుకు యాడ్ చేసిన Author కు మీ లాగే బ్లాగును ఎడిట్ చేయడానికి అడ్మిన్ హోదా ఇవ్వాలంటే ఈ క్రింది విధంగా settings - permissions - Blog Authors లో మీ గెస్ట్ ఆథర్ కు ఎదురుగా ఉన్న grant admin previleges ను క్లిక్ చేయండి. ఇక మీ
గెస్ట్ ఆథర్స్ కూడా మీ లాగే బ్లాగును పూర్తిగా ఎడిట్ చేయగలుగుతారు

No comments:

Post a Comment