ఇంట్రడక్షన్ పోస్ట్ ఎపుడూ బ్లాగు మొదట్లోనే ఉంటేటట్లుగా అతికించండి. sticky post

సాధారణంగా ఏదైనా కొత్త పోస్ట్ పబ్లిష్ చేయగానే, దానికంటే ముందున్న పోస్ట్ లు పాత పేజీలలోకి వెళ్ల పోతుంటాయి. కానీ మన బ్లాగు కు సంబందించిన ఇంట్రడక్షన్ పోస్ట్ బ్లాగు కు మొదట్లోనే ఉండాలని కోరుకుంటుంటాము. అలా ఎన్ని కొత్త పోస్ట్ లు వచ్చినా కూడా ఇంట్రడక్షన్ పోస్ట్ మాత్రం బ్లాగు మొదట్లోనే ఉండేటట్లు చేయడాన్ని స్టిక్కీ పోస్ట్ అంటాము. స్టిక్కీ పోస్ట్ ను రెండు పద్ధతులుపయోగించి చేయవచ్చు.
1 వ పద్ధతి: పోస్ట్ డేట్ ఆప్షన్స్ మోడిఫై చేయడం ద్వారా..(ఈ పద్ధతి లో స్టిక్కీ పోస్ట్ కు కామెంట్స్ ఎనేబుల్ చేయబడి ఉంటాయి.)
2.వ పద్దతి: HTML / JavaScript Gadget నుపయోగించడం ద్వారా (.(ఈ పద్ధతి లో స్టిక్కీ పోస్ట్ కు కామెంట్స్ డిసేబుల్ చేయబడి ఉంటాయి.)

మొదటి పద్ధతి: లో స్టిక్కీ పోస్ట్ ను ఎలా చేయాలో ఇపుడు తెలుసుకుందాం. ఎపుడో మీరు చేసిన పోస్టును బ్లాగు మొదట్లోకి ఎలా తీస్కొని రావాలో ఇందులో చూద్దాం .(కొత్త గా చేసే పోస్ట్ ల కయినా ఇదే పద్ధతి ఉపయోగించవచ్చు.)

1. Layout - Edit posts క్లిక్ చేయండి.


2. మీరు ఏ పోస్ట్ నయితే బ్లాగు మొదట్లో అతికించాలనుకుంటున్నారో ఆ పోస్ట్ Edit మీద క్లిక్ చేయండి.


3. ఇపుడు పోస్ట్ బాక్స్ క్రింద ఎడమ వైపున Post Options క్లిక్ చేయండి.


4. వెంటనే కుడివైపున post date and time కనపడుతుంది. సంవత్సరం దగ్గర 2009 అంతే 09 తీసివేసి 15 కాని 20 కాని సెట్ చేసి PUBLISH POST క్లిక్ చేయండి.ఇక మీ పోస్ట్ మీరు పెట్టిన సంవత్సరం వరకు మొదట్లోనే ఉంటుంది.

రెండవ పద్ధతి: లో స్టిక్కీ పోస్ట్ ను ఎలా చేయాలో ఇపుడు తెలుసుకుందాం.

1. New Post ద్వారా ఒక పోస్ట్ క్రియేట్ చేయండి. పోస్ట్ టైటిల్ కూడా పోస్ట్ బాక్స్ లోపలి భాగాన్నే తయారు చేసి Bold మరియు Color ఛేంజ్ చేయండి. మిగిలిన మ్యాటర్ నార్మల్ టెక్స్ట్ లో టైప్ చేయండి.

2. క్రింద save now బటన్ ను ప్రెస్ చేయండి. (Publish Post క్లిక్ చేయవద్దు).

3. ఇపుడు Edit Html క్లిక్ చేయండి.4. Edit Html box లోని మొత్తం పోస్ట్ కోడ్ ను కాపీ చేయండి.

5. Layout-Page elemetns లో Add a Gadget click చేయండి.


6. HTML/Javascript లో మీరు ఇంతకు ముందు కాపీ చేసిన post html code ను పేస్ట్ చేసి సేవ్ బటన్ ను క్లిక్ చేయండి.

7. HTML/Javascript Gadgget ను Drag చేసి Blog Posts పైన పెట్టండి.


అంతే ఇక మీ sticky post రెడీ అయినట్లే..

1 comment:

  1. ఇప్పుడిప్పుడే బ్లాగ్లోకంలో ఓనమాలు నేర్చుకుంటున్నా. నాలాంటి వారికి మీ బ్లాగు చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.

    ReplyDelete