బ్లాగ్ లో వీడియో సెర్చింగ్

వీడియో సెర్చింగ్ కోసం గూగుల్ వీడియోస్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ చేయకుండా...ఆ సెర్చ్ ఇంజిన్ నే తెచ్చి మీ బ్లాగులో పెట్టుకొని సెర్చ్ చేస్కుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదూ! ఈ బ్లాగులో కుడి వైపు కిందకి స్క్రోల్ చేసి చూడండి. అలాంటి సెర్చ్ ఇంజిన్ కనిపిస్తుంది. టెస్ట్ చేసి చూడండి.

http://www.google.com/uds/solutions/wizards/videosearch.html
ఈ లింక్ ను క్లిక్ చేసి, మీ బ్లాగు url ను ఎంటర్ చేసి విడ్జెట్ కోడ్ ను కాపీ చేస్కోండి. తర్వాత మీ బ్లాగులో Page elements >> Add a Gadget >>HTML/Javascript లో కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇక నుంచి మీ బ్లాగులో కూడా గూగుల్ వీడియో సెర్చ్ ఇంజిన్ రన్ అవుతుంది.

ఇక ఏ సైట్ నైనా మీ బ్లాగ్ లోనే ఓపెన్ చేయండి.

నమ్మట్లేదా? నిజమండీ! మీరు ఏదైనా పదాన్ని గూగుల్ లో వెతకాలనుకున్నపుడు ఏం చేస్తారు. ఇంకొక విండోలోనో, ట్యాబ్ లోనే గూగుల్ సైట్ ఓపెన్ చేసి వెతుకుతారు కదా? కానీ ఈ విడ్జెట్ మీ బ్లాగులో ఉంటే......ఆ సైట్ ను మీ బ్లాగులోనే మినీ బ్రౌజర్ లో ఓపెన్ చేయొచ్చు. మరి మీ బ్లాగు చూస్తూనే అందులోనే ఏ సైట్ నైనా ఓపెన్ చేయడం! బాగుంది కదూ! మరి...క్రింద లింక్ ను క్లిక్ చేసి ఆ విడ్జెట్ అందిస్తున్న సైట్ లోకి వెళ్లి, విడ్జెట్ ను మీకు కావలసినట్లు మార్చుకొని మీ బ్లాగులో పెట్టేసుకోండి.


http://www.widgetbox.com


http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

మీకు Skype అకౌంట్ ఉందా? అయితే మీ బ్లాగులో Skype బటన్ యాడ్ చేయండి.

మీ బ్లాగును చదివే రీడర్స్ మీతో డైరెక్ట్ గా skype లోకి మీ బ్లాగుద్వారానే ఛాట్ చేయడానికి గాని, లేదా కాల్ చేయడానికి గాని, ఈ బటన్ నుపయోగించవచ్చు.

http://www.skype.com/share/buttons/
http://mahigrafix.com/forums

మీ బ్లాగులోని పోస్టులో ఏ పదములోనైనా సరే, ఆ పదానికే కామెంట్స్ వ్రాసేయండి.

సహజంగా అందరూ పోస్టు అడుగు భాగాన కామెంట్ చేస్తుంటారు. కానీ ఈ విడ్జెట్ ద్వారా ఈ క్రింది విధంగా మనకు కావలసిన మ్యాటర్ ను మాత్రమే సెలెక్ట్ చేస్కొని, కామెంట్ చేయొచ్చు. ఆ పదము మీదకు మౌస్ ఓవర్ చేయగానే ఆ కామెంట్ కనిపిస్తుంది. ఈ విడ్జెట్ కోసం http://linebuzz.com ను క్లిక్ చేసి అందులో రిజిస్టర్ చేస్కొని కోడ్ ను కాపీ చేస్కొని page elements >> Add a gadget >> HTML/JavaScript లో పేస్ట్ చేసి సేవ్ చేయడమే.

http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

మీ బ్లాగులోని లింక్ ఓపెన్ చేయకముందే ప్రివ్యూస్ కనపడటానికి

మీ బ్లాగులో ఏదైనా url లింక్ మీదకు మౌస్ ఓవర్ చేయగానే, ఆ లింక్ లోని పేజిని క్రింది విధంగా ప్రివ్యూ చేసి చూపడానికి http://www.snap.com/ లోకి వెళ్లి మీ బ్లాగు వివరాలతో అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేస్కొని మీ బ్లాగుకు ఆ విడ్జెట్ ను యాడ్ చేయడమే.
http://mahigrafix.com/forums

ఇక ఎక్కడినుంచైనా సరే మీ పెన్ డ్రైవ్ నుండే బ్లాగుల్లో పోస్ట్ చేయండి.

మీరు బ్లాగుల్లో పోస్టు చేయాలంటే మీ ఇంట్లో కంప్యూటర్ నుండే చేయాలా?
మరి మీరు ఎప్పుడైనా పని మీద ఊరికెళ్లి మరి పోస్ట్ చేయడానికి కుదరకపోతే?
ఒకవేళ ఏ ఇంటర్నెట్ సెంటర్ లోకి వెళ్లి చేద్దామంటే...ఆ సిస్టమ్ లో పాస్వర్డ్ హ్యాకర్స్ ఉంటే?
హమ్మో..ఇంకేమైనా ఉందా? మీ బ్లాగులతో వేరే హ్యాకర్స్ ఇష్టం వచ్చినట్లు ఆడుకోరూ....
అందుకనే ఎక్కువగా జర్నీ చేసే బ్లాగర్స్ ఈ క్రింది w.bloggar ను డౌన్లోడ్ చేస్కొని మీ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్కోండి.
Download
తర్వాత ఈ క్రింద చూపిన విధంగా w.bloggar.exe ని ఓపెన్ చేసి మీ అకౌంట్ వివరాలను సేవ్ చేయండి.


ఇక పెన్ డ్రైవ్ లోనుంచే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. పోస్ట్ కంపోజ్ చేస్కోండి. సేవ్ చేయండి. ఇక ఆ పెన్ డ్రైవ్ తో ఎక్కడైనా బ్లాగర్ లోకి లాగిన్ కాకుండానే..సేవ్ చేసిన పోస్టులను పబ్లిష్ చేయండి.
http://mahigrafix.com/forums

మీ బ్లాగు కూడా అందరి బ్లాగుల్లాగే ఉండాలా? మీకంటు ఒక గుర్తింపు వద్దా?

కావాలని ఉంది కదూ! మరి వెరైటీగా ఉండాలంటే ఏం చేయాలి?
బ్లాగు థీమ్ మారుస్తే సరిపోతుందా? ఊఁ హూఁ..కానే కాదు.
అదే థీమ్ మిగిలిన బ్లాగర్స్ కూడా అప్లై చేస్కుంటారు. అప్పుడు మీ బ్లాగు కూడా వాళ్ల బ్లాగుల్లో ఒకటైపోతుంది.
మరి ఎలా?
మీరు చేయగలిగినది, ఇంకొకరు చేయలేనిది మీ బ్లాగులో ఇంకొకటి ఉంది. ఏంటది?
మీ బ్లాగు టైటిలండీ!
మీరు మీ బ్లాగుకు టైటిల్ ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు.
అసలు మీ బ్లాగు థీమ్ కంటెంట్ ఏమిటి?
ఇలాంటి అంశాలను పరిగణలోకి తీస్కొని, మీ బ్లాగుకు ఒక లోగో తయారు చేస్కోండి.
ఆ లోగో మీ బ్లాగు కాన్సెప్ట్ ను హైలెట్ చేయాలి.
మరి లోగో చేయాలంటే లోగో మేకింగ్ సాఫ్ట్వేర్ ఎలా?
"అన్నీ సాఫ్ట్వేర్లు ట్రై చేశామండి! లోగో చేయటం చాలా కష్టం ఒక వేళ కష్టపడి తయారు చేస్కున్నా! చివర్లో పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేస్కోమంటుంది"
అంటున్నారా!
ఇక మీరు అంత కష్టపడనవసరంలేకుండా ఆన్ లైన్ లోనే http://www.logosnap.com/ ద్వారా ప్రొఫెషనల్ లోగోస్ తయారు చేస్కోండి అదీ కూడా ఉచితంగానే.
మరి మొదలు పెట్టండి. మీ బ్లాగుకోసం మంచి లోగో తయారు చేస్కొని హెడర్ లో పెట్టేస్కోండి!!!!
http://mahigrafix.com/forums

మీ బ్లాగులో తెలుగు బ్లాగుల లిస్ట్ స్క్రోల్ చేయడానికి విడ్జెట్స్

తెలుగు బ్లాగుల లిస్టును అందమైన విడ్జెట్స్ తో మీ బ్లాగులో పెట్టకోవడానికి ఈ సైట్ ను విజిట్ చేయండి.
సైట్ లింక్: http://telugublogs.feedcluster.com

http://mahigrafix.com/forums