మీ బ్లాగు కూడా అందరి బ్లాగుల్లాగే ఉండాలా? మీకంటు ఒక గుర్తింపు వద్దా?

కావాలని ఉంది కదూ! మరి వెరైటీగా ఉండాలంటే ఏం చేయాలి?
బ్లాగు థీమ్ మారుస్తే సరిపోతుందా? ఊఁ హూఁ..కానే కాదు.
అదే థీమ్ మిగిలిన బ్లాగర్స్ కూడా అప్లై చేస్కుంటారు. అప్పుడు మీ బ్లాగు కూడా వాళ్ల బ్లాగుల్లో ఒకటైపోతుంది.
మరి ఎలా?
మీరు చేయగలిగినది, ఇంకొకరు చేయలేనిది మీ బ్లాగులో ఇంకొకటి ఉంది. ఏంటది?
మీ బ్లాగు టైటిలండీ!
మీరు మీ బ్లాగుకు టైటిల్ ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు.
అసలు మీ బ్లాగు థీమ్ కంటెంట్ ఏమిటి?
ఇలాంటి అంశాలను పరిగణలోకి తీస్కొని, మీ బ్లాగుకు ఒక లోగో తయారు చేస్కోండి.
ఆ లోగో మీ బ్లాగు కాన్సెప్ట్ ను హైలెట్ చేయాలి.
మరి లోగో చేయాలంటే లోగో మేకింగ్ సాఫ్ట్వేర్ ఎలా?
"అన్నీ సాఫ్ట్వేర్లు ట్రై చేశామండి! లోగో చేయటం చాలా కష్టం ఒక వేళ కష్టపడి తయారు చేస్కున్నా! చివర్లో పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేస్కోమంటుంది"
అంటున్నారా!
ఇక మీరు అంత కష్టపడనవసరంలేకుండా ఆన్ లైన్ లోనే http://www.logosnap.com/ ద్వారా ప్రొఫెషనల్ లోగోస్ తయారు చేస్కోండి అదీ కూడా ఉచితంగానే.
మరి మొదలు పెట్టండి. మీ బ్లాగుకోసం మంచి లోగో తయారు చేస్కొని హెడర్ లో పెట్టేస్కోండి!!!!
http://mahigrafix.com/forums

2 comments:

  1. మీ బ్లాగు చూశాను...బ్లాగు గురించిన అనేకమైన విషయాలు ఆశ్చర్యం కలిగేలా అందంగా వివరించారు...సంతోషం.

    ReplyDelete
  2. ఇది కూడా డబ్బులు అడుగుతుందండి!

    ReplyDelete