మీ బ్లాగు కోసం తయారు చేసిన పోస్టులు మీరు సెట్ చేసిన టైమ్ కు publish అయేటట్లుగా settings

ఒక్కోసారి మన ఖాళీ సమయంలో బ్లాగు కోసమని ఒకే సారి 5/6 పోస్టులు చేసి పబ్లిష్ చేస్తుంటాము. అలా కాకుండా మీరు తయారు చేసి పెట్టిన 5 పోస్టులు రోజుకు ఒకటి లేదా మీరు కోరుకున్న టైమ్ లో ప్రచురితమయ్యేటట్లుగా పోస్టు publish చేయవచ్చు. ఈ ప్రాసెస్ ను బ్లాగులలో scheduled posts అంటారు. అదెలా చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1.http://draft.blogger.com ను క్లిక్ చేసి మీ బ్లాగర్ ఐడీ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవండి.

2. Dash Board లో మీరు ఏ బ్లాగులో షెడ్యూల్డ్ పోస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ బ్లాగు క్రింద ఉన్న NEW POST ను క్లిక్ చేయండి.
3.ఇపుడు మీకు కొత్త పోస్ట్ బాక్స్ కనిపిస్తుంది.
4.అందులో మీరు వ్రాయలనుకున్న మ్యాటర్ వ్రాసేయండి.
5.తర్వాత పోస్ట్ బాక్స్ క్రింది ఎడమ భాగాన ఉన్న Post Options ను క్లిక్ చేయండి.
6.ఈ క్రింది ఫిగర్ లో లాగ మీకు ఇంకొక Expandable Menu open అవుతుంది. అందులో క్రింద చూపించిన విధంగా Scheduled at క్రింద ఉన్న డేట్ మరియు టైమ్ ను మీ పోస్ట్ ఎపుడు పబ్లిష్ కావాలనుకుంటున్నారో ఆ టైమ్ కు , డేట్ కు మార్చండి. తర్వాత PUBLISH POST ను క్లిక్ చేయండి. మీ పోస్ట్ మీరు సెట్ చేసిన టైంకు మీ బ్లాగులో ప్రచురించబడుతుంది.గమనిక: ఇలా చేయాలంటే http://blogger.com లోకి కాకుండా http://draft.blogger.com లోకి లాగిన్ అవాలి