మీ బ్లాగులో మీకు నచ్చిన పాటను పోస్టు చేయడానికి ఫ్రీ విడ్జెట్

మీ బ్లాగులో ఆడియో సాంగ్స్ పెట్టుకోవడానికి esnips వారు ఫ్రీ విడ్జెట్ ను ఇస్తున్నారు. ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో కాని వెబ్ సైట్ లో కాని ఎలా పెట్టుకోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. www.esnips.com ను క్లిక్ చేసి ఈ వెబ్ సైట్ లోకి ఎంటర్ అవండి.

2. ఈ క్రింది చూపిన విధంగా Join Now బటన్ ను క్లిక్ చేసి registration form ను మీ వివరాలతో ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.


3. మీ రిజిస్టర్డ్ ఐడీ మరియు పాస్వర్డ్ నుపయోగించి www.esnips.com లోకి లాగిన్ అవండి. తర్వాత కుడి వైపున upload files,create folder అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. create folder ద్వారా మీరు సొంతంగా esnips లో ఫోల్డర్ ను క్రియేట్ చేస్కొని మీ Mp3 ఫైల్ ను అందులోకి అప్ లోడ్ చేయండి.4. తర్వాత క్రింద చూపిన విధంగా folders ను క్లిక్ చేసి అందులో మీరు అప్ లోడ్ చేసిన సాంగ్ క్రింద ఉన్న add to quicklist ను క్లిక్ చేయండి.


5. ఇపుడు మీ ఫైల్ క్రింద mp3widgets అనే బటన్ ను క్లిక్ చేయండి.6. copy and paste code విభాగం క్రింద ఉన్న కోడ్ ను కాపీ చేస్కోండి.7. ఆ కోడ్ ను మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో >> add a gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి సేవ్ చేయండి.
లేదా మీరు ఈ కోడ్ ను పోస్టులో కూడా పేస్ట్ చేసి పబ్లిష్ చేయవచ్చు.

ఇక మీ బ్లాగులో మీరు కోరుకున్న పాట ప్లే కావడానికి రెడీ.