బ్లాగ్ లో వీడియో సెర్చింగ్

వీడియో సెర్చింగ్ కోసం గూగుల్ వీడియోస్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ చేయకుండా...ఆ సెర్చ్ ఇంజిన్ నే తెచ్చి మీ బ్లాగులో పెట్టుకొని సెర్చ్ చేస్కుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదూ! ఈ బ్లాగులో కుడి వైపు కిందకి స్క్రోల్ చేసి చూడండి. అలాంటి సెర్చ్ ఇంజిన్ కనిపిస్తుంది. టెస్ట్ చేసి చూడండి.

http://www.google.com/uds/solutions/wizards/videosearch.html
ఈ లింక్ ను క్లిక్ చేసి, మీ బ్లాగు url ను ఎంటర్ చేసి విడ్జెట్ కోడ్ ను కాపీ చేస్కోండి. తర్వాత మీ బ్లాగులో Page elements >> Add a Gadget >>HTML/Javascript లో కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇక నుంచి మీ బ్లాగులో కూడా గూగుల్ వీడియో సెర్చ్ ఇంజిన్ రన్ అవుతుంది.

ఇక ఏ సైట్ నైనా మీ బ్లాగ్ లోనే ఓపెన్ చేయండి.

నమ్మట్లేదా? నిజమండీ! మీరు ఏదైనా పదాన్ని గూగుల్ లో వెతకాలనుకున్నపుడు ఏం చేస్తారు. ఇంకొక విండోలోనో, ట్యాబ్ లోనే గూగుల్ సైట్ ఓపెన్ చేసి వెతుకుతారు కదా? కానీ ఈ విడ్జెట్ మీ బ్లాగులో ఉంటే......ఆ సైట్ ను మీ బ్లాగులోనే మినీ బ్రౌజర్ లో ఓపెన్ చేయొచ్చు. మరి మీ బ్లాగు చూస్తూనే అందులోనే ఏ సైట్ నైనా ఓపెన్ చేయడం! బాగుంది కదూ! మరి...క్రింద లింక్ ను క్లిక్ చేసి ఆ విడ్జెట్ అందిస్తున్న సైట్ లోకి వెళ్లి, విడ్జెట్ ను మీకు కావలసినట్లు మార్చుకొని మీ బ్లాగులో పెట్టేసుకోండి.


http://www.widgetbox.com


http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

మీకు Skype అకౌంట్ ఉందా? అయితే మీ బ్లాగులో Skype బటన్ యాడ్ చేయండి.

మీ బ్లాగును చదివే రీడర్స్ మీతో డైరెక్ట్ గా skype లోకి మీ బ్లాగుద్వారానే ఛాట్ చేయడానికి గాని, లేదా కాల్ చేయడానికి గాని, ఈ బటన్ నుపయోగించవచ్చు.

http://www.skype.com/share/buttons/
http://mahigrafix.com/forums