బ్లాగు పోస్టుల లింక్ లు ఆటోమేటిక్ బ్యుల్డింగ్ - ట్యుటోరియల్

బ్యాక్ లింక్స్ ద్వారా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ పెరిగి పేజి విజిట్స్ పెరుగుతాయి అన్నది మీకు తెలిసిన విషయమే. బ్యాక్ లింక్స్ పెరగాలంటే ఇతరుల బ్లాగులలో మీ పోస్టుల లింక్ లు షేర్ చేయబడి ఉండాలి. సహజంగా మీ బ్లాగులో ఏదైనా పవర్ ఫుల్ ఆర్టికల్ ను ప్రచురించినపుడు, ఇతర బ్లాగరులు ఫలానా విషయం పై ఫలానా బ్లాగులో ఒక మంచి ఆర్టికల్ ను ప్రచురించారు. అని మీ పోస్టు యొక్క లింక్ ను షేర్ చేస్తారు. అలా లింక్ చేయడానికి ఒక యాంకర్ ట్యాగ్ ను, పోస్టు URL అడ్రస్ ను, మరియు పోస్టు టైటిల్ నుపయోగిస్తారు. కాబట్టి వీటిని బ్యాక్ లింక్ కోడ్ అని కూడా పిలవొచ్చు. మరి ఈ బ్యాక్ లింక్ కోడ్ మీ బ్లాగులోని ప్రతి పోస్టు క్రింద అందుబాటులో ఉంటే సులభంగా కాపీ చేస్కొని షేర్ చేయవచ్చు కదా? మరి అదెలాగో చూద్దామా?1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి.2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.

3. ఇపుడు కీబోర్డ్ లో Ctrl+F ను ప్రెస్ చేసి, Edit Template లో క్రింది కోడ్ ను సెర్చ్ చేయండి.
<data:post.body/>


4. పై కోడ్ క్రింద(తర్వాత)నే ఈ క్రింది కోడ్ ను పేస్ట్ చేయండి.
<textarea cols='55' id='bloglinking' name='bloglinking' onclick='this.focus();this.select()' onfocus='this.select()' onmouseover='this.focus()' readonly='readonly' rows='1'>&lt;a href=&quot;<data:post.url/>&quot;&gt;<data:post.title/>&lt;/a&gt;</textarea>

5. Preview బటన్ ను క్లిక్ చేసి, ఓకే అనుకుంటే Save చేయండి.

2 comments:

  1. thank u friend...
    http://www.tollywoodmp3.in/

    ReplyDelete
  2. Nice article
    http://www.vijayamavuru.blogspot.com

    ReplyDelete